నరేష్ 'ఆకాశరామన్న' 12న
అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల, మీరాజాస్మిన్, గౌరీపండిట్ ప్రధాన పాత్రల్లో రూపొందిన వైవిధ్య భరిత చిత్రం 'ఆకాశరామన్న'. నాగబాబు ఆశీస్సులతో మన్యం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అశోక్ దర్శకుడు. మార్చి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మన్యం రమేష్ ప్రకటించారు.
విభిన్న కథ-కథనాలతో ఈ చిత్రం రూపొందిందనీ, పూర్తి వినోదాత్మకంగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందనీ ఆయన తెలిపారు. అల్లరి నరేష్ 'గమ్యం' తర్వాత మళ్లీ అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ ను ఇందులో పోషించారనీ, అలాగే శివాజీ, రాజీవ్ కనకాల పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉందనీ చెప్పారు. ఇది థ్రిలర్ కానప్పటికీ సస్పెన్స్, కామెడీ సమపాళ్లలో ఉంటుందనీ, కథలో ఎక్కువ భాగం రాత్రివేళలోనే జరుగుతుందన్నారు. పది నిమిషాలు ప్రేక్షకుడు మిస్ అయినా మళ్లీ కథలోకి రావడానికి టైమ్ పడుతుందని చెప్పారు. 'ఆకాశరామన్న' ఎవరనేది సినిమా చూసి తెలుసుకోవాలని అన్నారు. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 12న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాగబాబు, మధుశర్మ, వేణుమాధవ్, రావు రమేష్, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటించారు. చక్రి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|