కిరణ్ రాథోడ్ డబుల్ ధమాకా
రాజ్ పుట్ రాయల్ ఫ్యామిలీకి చెందిన కిరణ్ రాథోడ్ దక్షిణాది భాషా చిత్రాలతో పాటు హిందీలోనూ గ్లామర్ నటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల కొత్త హీరోయిన్ల పోటీలో వెనుకబడిన కిరణ్ రాథోడ్ తన ప్రౌఢ అందాల ఆరబోతతో ఓ అడుగు ముందుకు వేసింది. ఆసక్తికరంగా ఈ వారం హీరోయిన్ కూడా ఆమే కానుంది. కిరణ్ రాథోడ్ నటించిన 'హైస్కూలు', 'వసూల్ రాణి' చిత్రాలు ఈనెల 5న విడుదలవుతున్నాయి. ఈ రొండూ రొమాంటిక్ కథాంశాలతో కూడినవే కావడంతో తెరనిండా ఆమె అందాలు బ్లో-అప్ గా ప్రేక్షకులను కనువిందు చేయబోతున్నాయి.
మోనికా బెల్లూచి నటించిన 'మలీనా' చిత్రం స్ఫూర్తితో రూపొందిన చిత్రం 'హైస్కూలు'. ఇందులో 30 ఏళ్ల కిరణ్ రాథోడ్ 13 ఏళ్ల కుర్రాడు కార్తీక్ తో ప్రేమలో పడుతుంది. ఈ ఇద్దరి మధ్యా గోవా బీచ్ లో తీసిన సాంగ్స్, ఇందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ఇప్పటికే ఈ చిత్రంలో 'ఏ'దో ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చాయి. ఇయితే ఇందులో ఎలాంటి అశ్లీలతా, అసభ్యతకు తావులేదనీ, పైగా యూత్ కు మెసేజ్ ఉంటుందనీ దర్శకుడు నరసింహ నంది, నిర్మాత మల్లన్న చెబుతున్నారు. ఇక 'వసూల్ రాణి' తమిళంలో రూపొందిన 'వసూల్' చిత్రానికి అనువాదం. ఇది కూడా రొమాంటిక్ ఎంటర్ టైనరే. ఇందులో డబ్బు సంపాదించడానికి ఏం చేసినా తప్పులేదని భావించే సినీతారగా కిరణ్ రాధోడ్ నటించింది. డబ్బున్న వ్యక్తులను తన వలలలో వేసుకుని మోసం చేసే ఈ తార ఓ డబ్బున్న కుర్రాడిని మోసం చేస్తోంది. నిజం తెలుసుకున్న ఆ కుర్రాడు ఆమె ఆగడాలకు ఎలాంటి అడ్డుకట్ట వేశాడనేది సినిమాలో చూడాల్సిందే. కథాపరంగా చూసినప్పుడు ఈ రెండు చిత్రాల్లోనూ ఎక్స్ పోజింగ్ కు, రొమాంటిక్ అంశాలకు పుష్కలమైన అవకాశం ఉందనేది నిర్వివాదాంశం. ఒకేరోజు కిరణ్ రాథోడ్ నుంచి రెండు రొమాంటిక్ ఎంటర్ టైనర్లు వస్తుండటంతో సమ్మర్ సీజన్ ప్రారంభంలోనే ప్రేక్షకుల హీట్ నషాలానికి అంటుతుందేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|