'బద్రీనాథ్'లో నానాపటేకర్
అల్లు అర్జున్ కథానాయకుడుగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 'బద్రీనాథ్' చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి వి.వి.వినాయక్ దర్శకుడు. 'మగధీర' తరహాలో ఇందులో లెక్కకు మించిన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వంటివి ఉండబోతున్నాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే దీనిని ఓ ప్రత్యేక చిత్రంగా నిలిపేందుకు అల్లు అరవింద్ పట్టుదలగా ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు నానా పటేకర్ ను ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ఓ కీలక పాత్రకు నానా అయితేనే సరైన న్యాయం జరుగుతుందని భావిస్తున్న అల్లు అరవింద్ ఇటీవలే ఆయనను ఈ చిత్రం కోసం ఒప్పించారనీ, ఇందుకోసం నానా అడిగిన భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారనీ తెలుస్తోంది.
ఈ చిత్రానికి ఎం.కీరవాణిని సంగీత దర్శకత్వం వహించనున్నారు. వి.వి.వినాయక్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండటం ఇదే ప్రథమం. ఇలాగే 'మగధీర'కు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన కమల్ కన్నన్ కు ఈ చిత్రం బాధ్యతను కూడా అప్పగించారనీ, 'అపరిచితుడు', 'రాఘవన్', 'దశావతారం' చిత్రాలకు పనిచేసిన రవివర్మ్ ని ఛాయాగ్రాహకుడిగా ఎంచుకున్నారనీ తెలుస్తోంది. మే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. అన్నట్టు...అల్లు అర్జున్ 'వరుడు' ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Be first to comment on this News / Article!
|