పోరాట యోధుడుగా ప్రభాస్!
ప్రభాస్ కెరీర్ లో 'వర్షం', 'ఛత్రపతి' చిత్రాలను బిగ్గెస్ట్ హిట్స్ గా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ప్రభాస్ కు అలాంటి హిట్ దొరకలేదు. 'బిల్లా' మాత్రం కమర్షియల్ గా ఫరవాలేదనిపించుకుంది. ఈ నేపథ్యంలో 'ఛత్రపతి' దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మళ్లీ ప్రభాస్ తోనే ఓ సెన్సేషన్ ఫిలిమ్ ను తెరకెక్కించాలని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ ను శతధ్రు వంశ యోధుడు కాలభైరవగా 'మగధీర'లో చూపించిన రాజమౌళి ఈసారి ప్రభాస్ ను స్వాతంత్ర్య పోరాట వీర యోధుడుగా చూపిస్తూ ఓ పీరియాడిక్ ఫిల్మ్ ను ప్లాన్ చేస్తున్నారు. దీనిని సొంత బ్యానర్ విశ్వామిత్ర క్రియేషన్స్ పై తెరకెక్కించాలనే ఆలోచనలో ఆయన ఉన్నారనీ, తన రెగ్యులర్ చిత్రాల కథారచయిత, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు స్క్రిప్టు రచన బాధ్యతలు అప్పగించారనీ తెలుస్తోంది. 1930-40 దశకాల నాటి కథగా ఈ చిత్రం ఉండబోతోంది.
ప్రభాస్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న 'డార్లింగ్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇదే సమ్మర్ లో విడుదలకు సిద్ధం కానుంది. దీని తర్వాత దశరథ్ ('సంతోషం' ఫేమ్) దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న చిత్రానికి ప్రభాస్ కమిట్ అయ్యారు. రాజమౌళి సైతం ప్రస్తుతం బయట బ్యానర్ లో సునీల్ హీరోగా నటిస్తున్న 'మర్యాద రామన్న' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ చిత్రం 2011 ప్రథమార్థంలో ప్రారంభమై ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Be first to comment on this News / Article!
|