కథను బట్టే 'కిస్': సమంత
? సమంత పేరులో వైవిధ్యం కనిపిస్తోంది
- సమంత అంటే ప్రార్ధనలను వినేది అని అర్ధం.
? ఇంతకుముందు తెలుగు సినిమాలు చూసేవారా
- లేదు. ఈమధ్యనే 'బొమ్మరిల్లు' చాలా బాగుందంటే ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాను. భాష అర్ధం కాకపోయినా ఏదో తెలియని భావోద్వేగం కట్టిపడేసింది. అలాగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంలో త్రిష బాగా నటించిందని విని డివిడి చూశాను. త్రిష అంటే నాకు చాలా ఇష్టం. 'ఏమాయ చేసావె' చిత్రంలో ఆమె కూడా నటించడం చాలా ఆనందంగా అనిపించింది.
?మొదటి సినిమాలో చీరలు, చుడీదార్లతో కనిపించారు. ఇవే కంటిన్యూ చేస్తారా
- లేదు. నేను బయట చీరలు, చుడిదార్లలో కనిపించడం చాలా అరుదు. మోడ్రన్ డ్రస్సులే ఇష్టం. జెస్సీ పాత్రకు చీరలు, చుడిదార్లు నప్పుతాయని అంటే వేసుకున్నా. మీరు బాగా గమనిస్తే ఈ సినిమాలో నాకు మేకప్ కూడా ఉండదు. సహజంగా ఉండాలని గౌతమ్ వద్దన్నారు.
? గౌతమ్ అంటే భయం ఎప్పుడు పోయింది
- గౌతమ్ సర్ సినిమాలంటే నాకు పిచ్చి. ఆయన అన్ని చిత్రాల్లోనూ హీరోయిన్ పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. నాకు నటన, ముఖ కవళికల విషయంలో గౌతమ్ చాలా సాయం చేశారు. గౌతమ్ చేసి చూపించిన దాన్ని నేను అలాగే కాపీ కొట్టానంతే. 'నువ్వు చేయగలవు' అంటూ గౌతమ్ ఇచ్చిన ప్రోత్సాహం మరిచిపోలేను.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|