?మీ హీరో నాగచైతన్యను ముద్దలతో మురిపించినట్టున్నారు
- నాగార్జున సార్ కొడుకున్న గర్వం చైతన్యలో ఏమాత్రం లేదు. ఒకే వయసు వాళ్లం కావడంతో చాలా సరదాగా ఉండేవాళ్లం. తనతో వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది. అతనో ఎనర్జిటిక్ స్టార్. ఇక ముద్దు సీన్లు మా ఇద్దరికీ సంబంధించినవి కావు. గౌతమ్ మీనన్ చెప్పినట్టు చేశామంతే.
? 'బృందావనం' గురించి...
- నిజంగా ఐయామ్ లక్కీ. కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కో అవకాశం వెతుక్కుంటూ వస్తోంది. 'ఏమాయ చేసావె' షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న 'బృందావనం' కోసం అడిగారు. నా పాత్ర పేరు ఇందు. చాలా బాగా ఉంటుంది. మోడ్రన్ గా కనిపిస్తాను.
? సినిమాల కోసం శిక్షణ తీసుకున్నారా
- నటనలో శిక్షణ అంటూ ఏమీ లేదు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అంటే ప్రాణం. ఎప్పుడూ వింటూ ఉంటాను. నా తొలి చిత్రానికి ఆయన పనిచేస్తారని ఎప్పుడూ ఊహించలేదు. డాన్స్ బాగా చేస్తానని నన్ను కాలేజీలో అందరూ అనేవారు. తారక్ తో (ఎన్టీఆర్) స్టెప్పులేస్తే గానీ నాకొచ్చిన డాన్స్ ఏమిటో తెలియదు.
?'ఏమాయ చేసావె' సినిమా కోసం బాగా కష్టపడి చేసిన సన్నివేశం..
- కార్తీక్ నా కోసం గోవా నుంచి వస్తాడు. అప్పుడు నేను పైనుంచి కిందకు దిగుతాను. పెద్ద సీన్ ఉంటుంది. ఎక్కడా కట్ చెప్పకుండా ఏకబిగిన చెప్పాలన్నారు. ప్రామ్టింగ్ కూడా లేకుండా చేశాను. బాగా ఏకాగ్రతతో చేసిన సన్నివేశం అంది. అమెరికా సెంట్రల్ పార్కులో వచ్చే సీన్ అంటే నాకు వ్యక్తిగతంగా ఇష్టం.
? సినిమా చూసి ఇంట్లో వాళ్లు ఏమంటున్నారు
- వాళ్లింకా చూడలేదు. మా వాళ్లు సినిమా చూడటం చాలా తక్కువ. నేను ఈ రంగంలోకి వస్తానంటే ముందు ఒప్పుకోలేదు. తర్వాత నిదానంగా నచ్చజెప్పాను.