? హీరోయిన్లతో త్రిష అంటే ఇష్టం కదా. మరి హీరోల్లో..
- సూర్య. ఆయన సినిమాలను నా స్కూల్ డేస్ నుంచి చూస్తున్నా. చాలా హ్యాండ్ సమ్ హీరో.
? సినిమా ఎంపికలో వేటికి ప్రాధాన్యం ఇస్తారు
- నా పాత్ర. కథ వింటున్నప్పుడే నా పాత్ర కళ్లముందు మెదలుతుంటుంది. దాన్ని బట్టి నిర్ణయిస్తాను.
? డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా...
- 'ఏమాయ చేసావె'లో జెస్సీ లాంటి గొప్ప క్యారెక్టర్ చేసే అవకాశం ఎవరికీ మొదట సినిమాకే రాదు. నేను అదృష్టవంతురాలిని. ఆ పాత్ర చేశాక ఇంకా ఏదో పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను అనుకోవడం అత్యాశే అవుతుంది.
?మీలో కమలిని ముఖర్జీ పోలికలు కనిపిస్తున్నాయి
- నాతో కూడా చాలా మంది అన్నారు. కాలేజీలో ఉన్నప్పుడు ఆటపట్టిస్తున్నారని అనుకునే దాన్ని. ఇప్పుడు నన్ను నేను పరీక్షగా చూసుకుంటే నిజమేనేమో అనిపిస్తోంది.
? తెలుగు, తమిళ చిత్రాల్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
- తమిళ్ బాగా మాట్లాడతాను. దీంతో అక్కడే మంచి భవిష్యత్ ఉంటుందని అనుకున్నాను. మేకప్ మొట్టమొదటసారి కోలీవుడ్ లో వేసుకున్నా. నా తొలిచిత్రం విడుదలైంది మాత్రం టాలీవుడ్ లోనే. అందుకే తెలుగు సినిమాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాను.