కథను బట్టే 'కిస్': సమంత
నాగచైతన్య కథానాయకుడుగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందిన 'ఏమాయ చేసావే' చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ చూరగొంటోంది. సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ సర్వూప్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
నాగచైతన్య సరసన నటించిన సమంత తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో ఆమె పోషించిన జెస్సీ పాత్రకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా యూత్ ను జెస్సీ క్యారెక్టర్ బాగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఎన్టీఆర్ సరసన 'బృందావనం' చిత్రంలో సమంత నటిస్తూ టాలీవుడ్ లో బిజీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెతో జరిగిన ఇంటర్వ్యూ...
? సమంత తెలుగమ్మాయేనట కదా
- (నవ్వుతూ) మానాన్న తరఫు వారంతా తెలుగువారే. కొన్ని తరాలకు ముందు తమిళనాడుకు తరలివచ్చారు. అమ్మ మలయాళీ. ఇంట్లో తమిళ్, ఇంగ్లీషు మాట్లాడుకుంటాం.
? తెలుగు మాట్లాడతారా
- వింటే పదాలను పట్టుకోగలను. మాట్లాడటం రాదు. ఇప్పుడు నేర్చుకుంటున్నా. 'ఏమాయ చేసావె' విషయంలో డైలాగ్ లను బట్టీపట్టి చెప్పేదాన్ని. పెద్ద కష్టమేమీ అనిపించలేదు.
? సినిమాలోకి వచ్చిన వైనం..
- చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో బికాం చదివాను. అప్పుడే నాయుడు హాల్ షాపింగ్ మాల్ వస్త్రాల కోసం మోడలింగ్ చేశాను. మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే ఓ తమిళ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత గౌతమ్ మీనన్ నుంచి పిలుపు వచ్చింది. మొదట్లో భయపడ్డాను. కానీ రెండు మూడుసార్లు పిలిచాక వెళ్లాను. నన్ను సెలక్ట్ చేసుకుంటారని మాత్రం అనుకోలేదు. అయితే సెలక్ట్ అయ్యాను. అదంతా గాడ్స్ గ్రేస్.
?అంటే...దేవుడిని నమ్ముతారా
- బాగా. కాకపోతే అదే పనిగా పూజలు, వ్రతాలు చేయను. నమ్మకమైతే ఉంది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|