ప్రియమణికే 'సాధ్యం'
సమ్మర్ సీజన్ ప్రారంభంలోనే వెండితెర హీటెక్కుతోంది. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా 'ఏ మాయ చేసావే' చిత్రంలో సమంత 'ముద్దు' ముచ్చట్లతో స్వీట్ ఎక్స్ పీరియన్స్ చవిచూసిన ప్రేక్షకులు ఇప్పుడు ప్రియమణి వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. జగపతిబాబుతో ముచ్చటగా మూడోసారి ప్రియమణి నటించిన 'సాధ్యం' చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రియమణి-జగపతిబాబు మధ్య నడిచిన స్క్రీన్ కెమెస్ట్రీకి 'పెళ్లయిన కొత్తలో', 'ప్రవరాఖ్యుడు' అద్దం పడితే, ఆ రెండూ కలిస్తే ఒక 'సాధ్యం' అవుతుందన్నారు ఫిల్మ్ క్రిటిక్స్. అందుకు కారణం లేకపోలేదు. సినిమా ఆడియో రిలీజ్ కు ముందే జగపతిబాబుతో ప్రియమణి కలిసి నటించిన కొన్ని 'హాట్' సన్నివేశాలు పబ్లిసిటీ స్టిల్స్ రూపంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
ప్రియమణి ఈ చిత్రంలో సుహాని అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. జీవితంలో తనకు ఎదురైన సమస్యలను పరిష్కరించుకుంటూ తన లక్ష్య సాధనకు కృషి చేసే అమ్మాయి పాత్ర ఆమెది. ఇంతవరకూ తాను ఇలాంటి పాత్రను పోషించలేదని ప్రియమణి చెబుతోంది. పాత్ర స్వభావాన్ని బట్టి ప్రియమణి ఇందులో 'డేర్ ఫీట్స్' చేస్తుందని, అవి ప్రేక్షకులను కన్నార్పకుండా చేస్తాయని అనుకోవచ్చు. 'ద్రోణ' చిత్రంలో బికినీ అందాలు ప్రదర్శించిన ప్రియమణి ఇందులో వైట్ టాప్, మినీ బాటమ్స్ ధరించడం చూస్తే అందచందాల ప్రదర్శన ప్రియమణికే సాధ్యమనుకోవచ్చు. వారం పదిరోజుల క్రితమే సమంత సృష్టించిన మ్యాజిక్ ను ప్రియమణి డామినేట్ చేస్తుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|