త్రిష రొమాంటిక్ టెన్షన్
'జెస్సీ వంటి ఆఫ్ బీట్ రోల్స్ దొరకడం చాలా అరుదు. ఇంత అద్భుతమైన రొమాంటిక్ ఫిల్మ్ లో నేనింత వరకూ నటించలేదు' అంటూ అందాల నటి త్రిష కళ్లు పెద్దవి చేసుకుని మరీ చెబుతోంది. శింబు సరసన ఆమె నటించిన 'విన్నైతాండి వరువాయా' చిత్రంలో ఇటీవలే తమిళంలో విడుదలై చక్కటి రొమాంటిక్ ఫిల్మ్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం తెలుగులో నాగచైతన్య-సమంత జంటగా 'ఏమాయ చేసావె'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ వెర్షన్ రిలీజ్ కు ముందు తన స్క్రీన్ రొమాన్స్ ను ఎలా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారోనని త్రిష టెన్షన్ పడిందట. సినిమా రిలీజై త్రిష నటన మెచ్చుకుంటూ ఆమె మొబైల్ ఫోన్స్ కు వస్తున్న కాల్స్, ఇన్ బాక్స్ నిండిపోవడం ఆమెను సంతోషంలో ముంచెత్తుతోంది. 'ఇలాంటి అద్భుతమైన రెస్పాన్ ను నా 35 సినిమాల కెరీర్ లో ఇంతవరకూ ఎరుగను. జెస్సీ పాత్రలో ఉన్న గొప్పతనం అది' అని త్రిష తన స్పందనను తెలియజేసింది.
'విన్నైతాండి..' తరహాలోనే మునుముందు కూడా 'లిప్ లాక్' సన్నివేశాలకు రెడీయేనా అని అడిగినప్పుడు, అలాంటి సీన్లు చేయడానికి తనకెప్పుడూ అభ్యంతరాలు లేవనీ, అయితే స్క్రిప్టు, డైరెక్టర్ ను బట్టే చేయాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందనీ ఆమె సమాధానమిచ్చింది. కెరీర్ పరంగా తాను ఒక స్టేజ్ కు చేరినందున ఇలాంటి విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోగలననీ, ఫలానా సినిమాలో ముద్దు సన్నివేశమో, బికినీ ధరించడమో ఇష్టం లేకపోతే నిర్దంద్వంగా తోసిపుచ్చే పొజిషన్ లో తాను ఉన్నాననీ చెప్పుకొచ్చింది. త్రిష ఎంత కుండబద్దలు కొట్టినా... ఆమె కెరీర్ ఇప్పుడు 'కట్టామీటా' చిత్రంతో బాలీవుడ్ లోనూ స్టార్ట్ అవుతుండటం, హిందీ సినిమాల్లో లిప్ కిస్ లు, బికినీ ప్రదర్శనలు సర్వసాధారణం కాబట్టి త్రిషకు మునుముందు మరిన్ని రొమాంటిక్ టెన్షన్ లు తప్పకపోవచ్చు.
Be first to comment on this News / Article!
|