'అదుర్స్' 128 కేంద్రాల్లో ఫిఫ్టీ
ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొడాలినాని, వల్లభనేని వంశీ నిర్మించిన 'అదుర్స్' చిత్రం 128 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ ను చవిచూసింది. అయితే విడుదలకు ముందు 'మగధీర' చిత్రం రికార్డులను క్రాస్ చేస్తుందనే అంచనాలకు మాత్రం గండిపడింది.
నిర్మాత కొడాలి నాని తమ చిత్రాన్ని తెలంగాణలో విడుదల కాకుండా అడ్డుకోలేక పోయారంటూ చేసిన వ్యాఖ్యాలు 'అదుర్స్' చిత్రానికి తెలంగాణ రీజియన్ లో ప్రతిఘటన ఎదురైంది. మంచి రన్నింగ్ లో ఉండగానే నైజాం ఏరియాలోని థియేటర్ల నుంచి అర్థాంతరంగా సినిమాను ఎత్తివేశారు. ఎన్టీఆర్ కు ఉన్న కమర్షియల్ స్టాటస్ ను చాటుకుంటూ ఈ చిత్రం ఉత్తరాంధ్రలో 28, తూర్పుగోదావరిలో 17, పశ్చిమగోదావరిలో 12, కృష్ణ 11, గుంటూరు 14, నెల్లూరు 9, సీడెడ్ 37 సెంటర్లలో 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది.
Be first to comment on this News / Article!
|