అనుష్కతో లారెన్స్ 'కాంచన'
'అరుంధతి' చిత్రంతో స్టార్ స్టాటస్ కు ఎదిగిన అందాల నటి అనుష్క తో మరిన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. 'అరుంధతి' చిత్రం తమిళనాట కూడా అనుష్కకు మంచి పేరు తెచ్చింది. ఆ చిత్రం తర్వాత హీరో విజయ్ తో నటించిన 'వేట్టైకారన్' కూడా హిట్టయింది. ఈ క్రమంలో హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న పాత్రలకు అనుష్క సైతం మొగ్గుచూపుతోంది. ప్రస్తుతం వి.సముద్ర దర్శకత్వంలో 'పంచాక్షరి' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో అనుష్క నటిస్తోంది. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ సైతం అనుష్కపై కన్నేసినట్టు సమాచారం. 'కాంచన' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం అనుష్కను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.
కొరియోగ్రాఫర్ గా అందరు అగ్రహీరోలతో పనిచేసిన లారెన్స్ తొలిసారి నాగార్జునతో 'మాస్' చిత్రానికి, ఆ తర్వాత మళ్లీ నాగార్జునతోనే 'డాన్' చిత్రానికి దర్శకత్వం వహించారు. 'డాన్'లో హీరోయిన్ అయిన అనుష్క ను ఇప్పటికే లారెన్స్ డైరెక్ట్ చేశారు. ఆ అనుబంధంతో అనుష్కను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకూ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను తీస్తూ వచ్చిన లారెన్స్ తొలిసారి హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ వైపు మళ్లడంతో ఇందులో అనుష్క పాత్ర ఎలా ఉండబోతోందనేది ఆసక్తి కలిగించే అంశం. ప్రస్తుతం లారెన్స్ 'సూపర్ కౌబాయ్' అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. అనుష్క సైతం 'పంచాక్షరి'తో పాటు క్రిష్ 'వేదం', మహేష్ బాబు 'కలేజా' చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. 'కాంచన'కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగుచూస్తాయి.
Be first to comment on this News / Article!
|