ఐరెన్ లెగ్ ఫ్యామిలీకి సాయం
కమెడియన్ ఐరెన్ లెగ్ శాస్త్రి కుటుంబానికి నటుడు కాదంబరి కిరణ్ చొరవతో కొంత ఆర్థిక సహాయాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేతుల మీదుగా బుధవారంనాడు అందజేశారు. గునుపూడి విశ్వనాథ శాస్త్రి అలియాస్ 'ఐరన్ లెగ్ శాస్త్రి' 2006 జూన్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. శాస్త్రి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుని కాదంబరి కిరణ్ కొంత మంది మిత్రుల నుంచి ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుని సుమారు 55 వేల రూపాయలు సేకరించారు. ఆ మొత్తాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో శాస్త్రి తనయుడికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ చేతుల మీదుగా అందించారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ, ఇలాంటి సందర్భాల్లో 'మా' ఆర్థిక సహాయం చేస్తుంటుందనీ, అయితే ప్రసుతం నిధుల లేమిని 'మా' ఎదుర్కొంటోందనీ అన్నారు. ఇలాంటి తరుణంలో ఎవరో ఒకరు చొరవ తీసుకుని ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమైన విషయమని అన్నారు. ఐరెన్ లెగ్ శాస్త్రి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుని అందరూ తలో చేయి వేసి ఆయన కుటుంబానికి చేతనైతంత సహాయం అందించినట్టు కాదంబరి కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.
Read 3 Comment(s) posted so far on this News / Article!
|