'కలెక్టర్ గారి భార్య' లోగో
ప్రకాష్ రాజ్, భూమిక జంటగా ఆమోద్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై టేకుల కృషాకర్ రెడ్డి స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి 'కలెక్టర్ గారి భార్య' అనే టైటిల్ ను ప్రకటించారు. హైద్రాబాద్ లోని ఎఫ్.ఎన్.సి.సి.లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రకాష్ రాజ్ ఈ లోగోను ఆవిష్కరించారు. భూమిక, టేకుల కృపాకర్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, దంపతుల మధ్య ఎలాంటి అవగాహన ఉండాలనే కాన్సెప్ట్ తో రూపొందుతున్న చిత్రమిదనీ, కథ బాగా నచ్చి మంచి రచయితలు కోసం అనుకున్నప్పుడు పరుచూరి సోదరులు జాయిన్ కావడంతో మంచి ప్రాజెక్ట్ అయిందనీ అన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, చాలా మంచి సబ్జెక్ట్ అనీ, కలెక్టర్ గారు అనే పేరుతో వచ్చిన సినిమాలన్నీ హిట్టయినట్టే ఇది కూడా మంచి హిట్ అవుతుందనీ అన్నారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇదనీ, ఇందులో మంచి క్యారెక్టర్ చేశాననీ భూమిక తెలిపారు. టేకుల కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ, హైద్రాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోందనీ, ఈనెల రెండవ వారంలో ఆడియో, ఏప్రిల్ లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రానికి చిన్నా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|