ఆర్...అంటే రంజిత?!
సంచలనం సృష్టించిన స్వామి నిత్యానంద సెక్స్ స్కాండిల్ వీడియోలో ఆయనతో కామకేళీ విలాసాల్లో పాల్గొన్న నటి రంజిత అనే ప్రచారం జరుగుతోంది. నిత్యానంద రాసలీలలు పేరుతో సన్ టీవీ ఈ వీడియోను ప్రసారం చేసింది. అయితే ఆయనతో శృంగార కలాపాలు చేసిన అమ్మాయిల ఐడెంటెటీ బయట పెట్టలేదు. 'ఆర్' అనే పేరుతో ప్రారంభమైన ఓ సినీ నటి ఇందులో పాల్గొన్నట్టు పలు ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా నక్కీరన్ మ్యాగజైన్ వెట్ సైట్ లో వాటర్ మార్క్ తో ప్రసారమైన ఫుల్ వీడియోను 'యూ ట్యూబ్'లో పోస్ట్ చేశారు. ఇందులో స్వామితో రాసలీలలు చేసిన అమ్మాయి తమిళ నటి రంజితను పోలి ఉండటం విశేషం.
నిత్యానందుని రాసలీలలను సన్ టీవీ, ఆ తదనంతరం ఇతర టీవీ ఛానెల్స్ ప్రసారం చేయడంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనమైంది. స్వామితో ఉన్న కుర్ర నటి ఎవరనేది పలు ఊహాగానాలకు దారితీసి చివరకు రంజిత పోలికలు స్పష్టంగా ఉండటంతో ఆమే కావచ్చని పలువురు నిర్దారిస్తున్నారు. భారతీరాజా 'నాడోడితెండ్రల్ ' చిత్రం ద్వారా తమిళంలో పరిచయమైన రంజిత ఒడ్డూపొడుగూ ఉన్న గ్లామరస్ నటిగా పేరు తెచ్చుకుని తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. గ్లామర్ ప్రపంచంలో ఉన్న కొందరు నటీమణులు ఓ వెలుగు వెలిగి సమయంలో విలాసవంతమైన జీవితాలకు అలవాడి పడి ఆ తర్వాత డిమాండ్ తగ్గిన తర్వాత కూడా ఆ అలావాట్లు వదులుకోలేక వక్రమార్గాలను ఆశ్రయిస్తుంటారు. కామిగాని వాడు మోక్షగామి కాదనే నానుడికి వక్రీకరించి కొందరు బూటకపు స్వాములు శరీరమున్నది సుఖించడానికేననీ, అప్పుడే వికారాలు దూరమై మోక్షానికి మార్గం సుగమమవుతుందనే మాయమాటలతో వంచనలకు పాల్పడుతుంటారు. హిమాలయమంత ఎత్తు ఎదిగి పాతాళలోకానికి పడిపోతుంటారు. వెరసి అమాయక భక్తులు మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉంటారు.
Be first to comment on this News / Article!
|