2న 'క్లాష్ ఆఫ్ ది టైటైన్స్'
జేమ్స్ కేమరన్ 'అవతార్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాదించి ఆస్కార్ బరిలో ఉత్తమ చిత్రంగా పోటీపడుతున్న తరుణంలో ఆ చిత్ర కథానాయకుడు శ్యాంవార్తింగ్టన్ నటించిన 'క్లాష్ ఆఫ్ ది టైటైన్స్' చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వార్నర్ బ్రదర్స్ సంస్థ లెజెండరీ పిక్చర్స్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని రత్నా సెల్యులాయెడ్ సమర్పణలో రజిత్ పార్థసారధి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగు వెర్షన్ తో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుదలవుతోంది.
'ఇన్ క్రెడిబుల్ హల్క్', 'ట్రాన్స్ పోర్టర్' వంటి చక్కటి చిత్రాలకు దర్శకత్వం వహించిన లూయీస్ లేటేర్రియర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, టూడీ, త్రీడీలలో కూడా సినిమా విడుదలకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు విందు వీడియో గేమ్ కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకులకు సరికొత్త లోకాల్లోకి వహరింపజేసే చిత్రమిదనీ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, గ్రాఫిక్స్ షాట్స్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని రజిత్ పార్థసారధి తెలిపారు. గ్రీక్ మైథలాజికల్ క్యారెక్టర్ ను శ్యాంవర్తింగ్టన్ పోషించారనీ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో లియాం నీసన్, రాల్ఫ్ పెన్నేస్, అలెక్సా డావోలేస్ తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|