ఛాన్సిస్తే దున్నేస్తా: అపర్ణ
మోడలింగ్ రంగం నుంచి తమిళ సినీ పరిశ్రమకు పరిచయమైన అపర్ణ బాజ్ పాయ్ తెలుగులోనూ నటించేందుకు సై అంటోంది. ప్రస్తుతం తమిళంలో డైరెక్టర్ శశికుమార్ ('సుబ్రహ్మణ్యపురం' ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ 5 చిత్రంలో హీరో వైభవ్ (సరోజ...గొడవ...కాస్కో చిత్రాల ఫేమ్) సరసన అపర్ణ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లో ప్రస్తుతం జరుగుతోంది. సెట్స్ లోనే అపర్ణ తనను పరిచయం చేసుకుంటూ టాలీవుడ్ లో కూడా నటించాలనుకుంటున్నట్టు చెప్పింది.
'నేను ఉత్తర ప్రదేశ్ కు చెందిన అమ్మాయిని. డాన్సింగ్ నేర్చుకుంటున్న సమయంలోనే మోడలింగ్ లో అవకాశాలు వచ్చాయి. తక్కువ సమయంలోనే కోక కోలా, నోకియా వంటి యాడ్స్ లో నటించాను. ఢిల్లీలో చదువుతుండగా ప్రముఖ తమిళ హీరో విక్రమ్ రూపొందిస్తున్న సినిమాకి కథానాయికగా ఎంపికయ్యాను. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయి. తెలుగు సినీరంగానికి కూడా పరిచయం కావాలనుకుంటున్నాను' అని అపర్ణ చెప్పుకొచ్చింది. నటించే సత్తా ఉండే తెలుగులో అవలీలగా గుర్తింపు తెచ్చుకోవచ్చనీ, ఇక్కడ చాలా మంది క్రియేటివ్ డైరెక్టర్లు ఉన్నారనీ కితాబిచ్చింది. పనిలో పనిగా తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకుంటున్నట్టు చెప్పింది.
Be first to comment on this News / Article!
|