'వరుడు' ఆడియో రీలీజ్
అల్లు అర్జున్ కథానాయకుడుగా గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్శల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మించిన 'వరుడు' చిత్రం ఈనెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రం ఆడియో వేడుక రామానాయుడు స్టూడియోస్ లో ఆదివారంనాడు కన్నులపండువగా జరిగింది. ఆడియో వేడుకలో పాల్గొన్నవారంతా పెళ్లి వేడుకకు హాజరైనట్టు పట్టుబట్టలు ధరించి హాజరుకావడం విశేషం. ఆడియో సీడీని ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించి అల్లు అరవింద్ కు అందజేశారు. ఆడియో క్యాసెట్ ను శ్యాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించి డి.సురేష్ బాబుకు అందజేశారు. మణిశర్మ సంగీతం అందించిన ఆడియో ఆదిత్యా మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది. అల్లు అర్జున్, గుణశేఖర్, మణిశర్మ, డివివి దానయ్య, వేటూరి సుందరరామమూర్తి, బి.గోపాల్, కె.ఎస్.రామారావు, దిల్ రాజు, ఎంఎల్ కుమార్ చౌదరి, అనితా చౌదరి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ, గుణశేఖర్, మణిశర్మలది అత్యద్భుతమైన కాంబినేషన్ అనీ, దానయ్య నిర్మాణ విలువలు ఈ చిత్రానికి మరో అడ్వాంటేజ్ అనీ అన్నారు. హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ ను యూనిట్ మెయింటెన్ చేస్తోందనీ, తప్పనిసరిగా ఇది బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందనీ అన్నారు. గేయరచయిత వేటూరి సుందరరామమూర్తి మాట్లాడుతూ, తనది పెద్దలు కుదిర్చిన వివాహమనీ, 75 ఏళ్లు పూర్తయినా ఇంత ఆనందంగా ఉన్నానంటే అదే కారణమనీ అన్నారు. కల్యాణ మంటపం నుంచి నిజమైన ప్రేమ మొదలవుతుందని తెలిపారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|