'వరుడు' ఆడియో రీలీజ్
అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఇది వందశాతం దర్శకుడి చిత్రమనీ, పాటలు చాలా కీలక భూమిక పోషిస్తాయనీ చెప్పారు. మణిశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనీ, ఇందులోని సంగీతం ఓ మ్యాజిక్ అనీ అన్నారు. అలాగే తనను ఎంతో హ్యాండ్ సమ్ గా కొత్త కోణంలో చూపించిన కెమెరామన్ రాజశేఖర్ కు, తమిళంలో హీరో అయినప్పటికీ ఈ చిత్రంలో విలన్ గా నటించిన ఆర్యకు తన కృతజ్ఞతలని అన్నారు. అందరూ తనను పెళ్లి కొడుకు (వరుడు) ఎప్పుడు అవుతావని అడుగుతున్నారనీ, దీనికి అల్లు అరవింద్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని నవ్వుతూ చమత్కరించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ, వరుడు టీమ్ కు హెడ్ గుణశేఖర్ అని అన్నారు. బన్నీని ప్రతి పుట్టినరోజుకు ఏది కావాలని అడుగుతుంటాననీ, కోటి రూపాలయ కారు కావాలని అంటుంటాడని తెలిపారు. రెండేళ్ల క్రితం తన సినిమాకి గుణశేఖర్ దర్శకుడు కావాలని కోరాడనీ, 'వరుడు'తో ఆ కోరిక తీరిందని అనుకుంటున్నాననీ అన్నారు. బన్నీ పెళ్లి విషయాన్ని ముచ్చటిస్తూ, బన్నీ ఎవరిని పెళ్లి చేసుకున్నా తమకు అభ్యంతరం లేదనీ, ఇటీవల ఏ అమ్మాయినైనా ప్రేమించావా అని అడిగినప్పుడు అలాంటి ఆలోచన లేదనీ, పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటాననీ చెప్పాడని తెలిపారు. బన్నీ చూడటానికి మోడ్రన్ లుక్స్ తో కనిపించినా సంప్రదాయ విలువల పట్ల గౌరవం మెండనీ, వరుడు చిత్రంలో ఈ అంశం ప్రతిబింబిస్తుందనీ అన్నారు. ఆడియో వేడుక సందర్భంగా వేటూరి సుందరరామమూర్తికి యూనిట్ ఘనంగా సన్మానించింది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|