'రంగ ది దొంగ' ఆటపాట
శ్రీకాంత్, విమలారామన్ జంటగా గోల్డెన్ లయన్ ఫిలిమ్స్, గాడ్ ఫాదర్ ఫిలిమ్స్ పతాకాలపై సి.ఆర్.మనోహర్, సుధాకర్ నాయుడు (జీవీ)సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రంగ ది దొంగ'. సుధాకర్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు.హైద్రాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. శ్రీకాంత్, జ్యోతి, భువనేశ్వరి, తస్లీమా షేక్, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొంటున్నారు. సెట్స్ లోనే చిత్ర యూనిట్ ఆ విశేషాలను తెలియజేసింది.
శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇందులో తాను విచిత్రమైన దొంగ పాత్రను పోషిస్తున్నాననీ, ముఖ్యంగా పోలీసుల ఇళ్లలోనే దొంగతనాలు చేస్తుంటాననీ అన్నారు. సినిమాలో ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాట ఓ హైలైట్ అవుతుందని అన్నారు. 'మహాత్మ' చిత్రం తర్వాత శ్రీకాంత్ తో చేస్తున్న ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని అన్నారు. దొంగతనాల్లో కొత్త కోణాన్ని ఇందులో చూపిస్తున్నట్టు దర్శకుడు జీవి తెలిపారు. మంచి టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి పూర్ణకాండ్రు సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|