నైట్ మిస్టరీ 'ఆకాశరామన్న'
అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల, మీరాజాస్మిన్, గౌరీ పండిట్ ప్రధాన పాత్రల్లో విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రం 'ఆకాశరామన్న'. మన్యం సూర్యనారాయణ సమర్పణలో మెగా బ్రదర్ నాగబాబు ఆశీస్సులతో మన్యం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ నిర్మించిన చిత్రమిది. అశోక్ దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది.
చిత్ర విశేషాలను మన్యం రమేష్ తెలియజేస్తూ, అశోక్ ఈ చిత్రం కాన్సెప్ట్ చెప్పగానే కథ, కథనాలు బాగా నచ్చి వెంటనే ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించామనీ, స్క్రీన్ ప్లే బేస్ట్ మూవీగా ఈ చిత్రం రూపొందిందనీ చెప్పారు. హీరో, హీరోయిన్లు పాత్రలు కాకుండా సినిమాలోని 17 క్యారెక్టర్లు వేటికవే ప్రాధాన్యం కలిగి కథను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయనీ, రాత్రి 12 నుంచి 12.40 గంటల వరకూ జరిగే సంఘటన సమాహారమే ఈ చిత్రమనీ చెప్పారు. 28 రాత్రుల్లో షూటింగ్ పూర్తి చేశామని అన్నారు. టైటిల్ కు తగ్గట్టే హిలేరియస్ కామెడీతో ఉత్కంఠభరితంగా సినిమా ఉంటుందనీ, ముఖ్యంగా సినిమా ప్రారంభాన్ని ఎవరూ మిస్ కాకూడదనీ చెప్పారు. చక్రి సంగీతం, ఆయన అందించిన రీరికార్డింగ్, సాయిశ్రీరాం మెస్మరైజింగ్ ఫోటోగ్రఫీ, ఆర్టిస్టుల పెర్ ఫారమన్స్ హైలైట్స్ అవుతాయన్నారు. ఆకాశరామన్న ఎవరో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాగబాబు, వేణుమాధవ్, రావు రమేష్, రఘబాబు, ఎమ్మెస్ నారాయణ, సత్యం రాజేష్, శ్రీనివాసరెడ్డి, టార్జాన్, సన, ఖయ్యూం, వేణు తదతరులు నటించారు. అనంత్ శ్రీరామ్ పాటలు, శేఖర్ మాటలు, మధుసూధర్ రెడ్డి డిటిఎస్, రఘనాథ్ ఎఫెక్ట్స్, గణేష్ ఫైట్స్ అందించారు.
Be first to comment on this News / Article!
|