9న 'సూపర్ కౌబాయ్' సాంగ్స్
ప్రముఖ కొరియాగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కథానాయకుడుగా 20 కోట్ల భారీ వ్యయంతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం 'సూపర్ కౌబాయ్'. ఎజిఎస్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై శింబుదేవన్ దర్శకత్వంలో కల్పాతి ఎస్.అగోరం సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ఈనెల 9న సోని మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది.
చిత్ర సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ, తెలుగులో తాను చేసిన 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రాన్ని ప్రేక్షకులు మ్యూజికల్ హిట్ చేశారనీ, మళ్లీ ఈ 'సూపర్ కౌబాయ్' కూడా మ్యూజికల్ హిట్ అవుతుందనీ అన్నారు. ఇందులోని అన్ని సాంగ్స్ యూత్ నూ, మాస్ నూ ఆకట్టుకుంటాయని అన్నారు. లారెన్స్ మాట్లాడుతూ, మంచి ఎంటర్ టైన్ మెంట్, థ్రిల్లింగ్ యాక్షన్ తో చాలా కాస్ట్ లీగా నిర్మించిన ఈ చిత్రం హీరోగా తనకు పెద్ద సక్సెస్ ను ఇస్తుందన్నారు. సినిమా చాలా చాలా బాగా వచ్చిందనీ, తెలుగులో చాలా పెద్ద హిట్ అవుతుందనీ అన్నారు. ఈ చిత్రంలో లారెన్స్ కు జోడిగా పద్మప్రియ, లక్ష్మీరాయ్ నటించారు. సాయికుమార్ ఓ ముఖ్య పాత్ర పోషించారు. సంధ్య, నాజర్, మనోరమ, సెంథిల్, మౌళి, ఢిల్లీ గణేష్, రమేష్ ఖన్నా ఇతర పాత్రలు పోషించారు. శ్రీరామకృష్ణ మాటలు, వనమాలి పాటలు, రాజ్ మహ్మద్ ఎడిటంగ్, గ్రేట్ సెల్వ పైట్స్ అందించారు.
Be first to comment on this News / Article!
|