కలర్స్ స్వాతితో సుమంత్
హీరో సుమంత్ సుమారు ఏడాది గ్యాప్ తర్వాత మళ్లీ ఓ కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. 'అష్టా చమ్మా' వంటి సూపర్ హిట్ చిత్రంతో ప్రేక్షకుల రివార్డులు, ప్రభుత్వ అవార్డులు అందుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, నిర్మాత పి.రామ్మోహన్ మళ్లీ ఆర్ బీట్ క్యాపిటల్ లిమిటెడ్ పతాకంపై మరో విభన్న కథా చిత్రంగా దీనిని రూపొందించనున్నారు. సుమంత్ సరనస కలర్స్ స్వాతి నటించనున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుబ్బరాజు, షఫీ ఇతర ముఖ్యపాత్రలు పోషించనున్నారు.
చిత్ర విశేషాలను నిర్మాత రామ్మోహన్ తెలియజేస్తూ, ఇంద్రగంటి దర్శకత్వంలో మరో మంచి చిత్రాన్ని తీస్తున్నందుకు హ్యాపీగా ఉందనీ, హరి మోహన్ పరువు రాసిన 'ది మెన్ వితిన్' అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామనీ చెప్పారు. కథ విని సుమంత్, స్వాతి తదితరులంతా ఎంతో ఇన్ సైర్ అయ్యారనీ, వెంటనే సినిమా ప్రారంభిద్దామని అన్నారనీ తెలిపారు. మళ్లీ 'అష్టా చమ్మా' టీమ్ అంతా కలిసి పనిచేస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రారంభించి సెప్టెంబర్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే-మాటలు సైతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|