'ఉయ్యాలవాడ' బాలయ్య
సిపాయిల తిరుగుబాటుకు (1857) ఓ పదేళ్ల క్రితమే స్వాతంత్ర్య పోరాటాన్నిసాగించి భారతదేశంలో తొలి స్వాంతంత్ర్య సరమయోధుడుగా అనిపించుకున్న ఉయ్యాలవాడ నరిసింహా రెడ్డి చరిత్రను తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ పీరియాడిక్ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా యువరత్న నందమూరి బాలకృష్ణ నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 'సింహా' చిత్రంలో నటిస్తున్న బాలకృష్ణ సూత్రప్రాయంగా ఈ చిత్రాన్ని చేసేందుకు జయంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు.
బాలకృష్ణ, జయంత్ కాంబినేషన్ లో గతంలో రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో 'లక్ష్మీనరసింహా' సక్సెస్ చవిచూసింది.'అల్లరి పిడుగు' బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూసింది. ఈ క్రమంలో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పాత్రకు బాలకృష్ణ అయితేనే న్యాయం జరుగుతుందని జయంత్ భావించినట్టు తెలుస్తోంది. దీనికితోడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సొంత గడ్డ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ కావడం, రాయలసీమలో బాలకృష్ణకు ఉన్న ఫాలోయింగ్ ను కూడా ఆయన పరిగణనలోకి తీసుకున్నారని అంటున్నారు. నిజానికి చిరంజీవి కథానాయకుడుగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం ఉండబోతోందనే ప్రచారం అప్పట్లో జరిగింది. రాజకీయాల్లోకి రాకముందు ఈ సినిమా ప్లానింగ్ జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ బాలకృష్ణ చేతిల్లోకి వచ్చిందనీ, పరుచూరి సోదరులు కథారచన చేయబోతున్నారనీ తెలుస్తోంది. 'సింహా' పూర్తికాగానే ఈ కొత్త ప్రాజెక్ట్ లోకి బాలకృష్ణ అడుగుపెడతారట. మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.
Be first to comment on this News / Article!
|