డిజైనర్ గా ఇలియానా తల్లి
తెలుగులో మంచి డిమాండ్ లో ఉన్న ఇలియానా ఇప్పుడు తమిళంలోనూ సరైన బ్రేక్ తెచ్చుకునేందుకు పట్టుదలగా ఉంది. ఇందుకు అనుగుణంగానే స్టార్ హీరో విక్రమ్ సరనస భూపతి పాండ్యన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో ఆమె నటించబోతోంది. ఈ చిత్రంలో ఇలియానాకు ఆమె తల్లి సమీరా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయనుండటం విశేషం. ఇలియానా కొత్త చిత్రానికి సంబంధించిన ఫోటో షూట్ ఇదేవారం చెన్నైలో జరగనుంది.
ఇలియానా పాల్గొనే ఫోటో షూట్ కోసం సమీరా ఇప్పటికే కొన్ని కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిందని, ఇందుకోసం సమీరా ఒక్క పైసా కూడా వసూలు చేయడం లేదనీ చెన్నై వర్గాల భోగట్టా. సమీరా సైతం తాను సొంతంగా తయారుచేసిన సమ్మర్ కలెక్షన్లను త్వరలోనే లాంచ్ చేయాలనుకుంటోంది. ఇలియానా సొంతగడ్డ అయిన గోవాలో ఈ కలెక్షన్లను ప్రదర్శించనున్నారనీ, ఈ సందర్భంగా జరిగే స్పెషల్ ఫ్యాషన్ షో లో ఇలియానా ర్యాంప్ వాక్ చేయబోతోందనీ తెలుస్తోంది. ఇలియానాకు ఉన్న క్రేజ్ సమీరాకు డ్రస్ డిజైనర్ గా మరింత మంచి పేరు తెచ్చి ఆ రంగంలో ఆమెను మరింత బిజీ చేస్తుందేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|