'బృందావనం' ఆగస్టు 15న
'అదుర్స్' చిత్రం సాధించిన కమర్షియల్ సక్సెస్ తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండానే ఎన్టీఆర్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడుగా దిల్ రాజు నిర్మిస్తున్న 'బృందావనం' (గోవిందుడు అందరి వాడేలే) శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ హిట్ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు దిల్ రాజు నిర్ణయించినట్టు సమాచారం. ఎన్టీఆర్ కు సూపర్ హిట్ ఇచ్చిన 'యమదొంగ' చిత్రం ఇదే తేదీన విడుదలైంది.
ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా 'ఏమాయ చేసావే' ఫేమ్ సమంత నటిస్తోంది. ప్రస్తుతం హైద్రాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అనంతరం చిత్ర యూనిట్ కర్ణాటక వెళ్తుంది. ఆ తర్వాత కేరళలో జరిపే మరో షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది. ఎన్టీఆర్ స్లిమ్ గా మారిన తర్వాత తొలిసారి లవర్ బాయ్ గా ఈ చిత్రంలో నటిస్తుండటం, ఎన్టీఆర్ త్వరలోనే పెళ్లి చేసుకోనుండటం ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలను రేకెత్తిస్తోంది. వంశీ పైడిపల్లి ('మున్నా' ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|