నాన్నతో నటిస్తా: నాగచైతన్య
నిర్ణయం నాదే...
సినిమాల ఎంపికలో నాన్నగారి అనుభవాన్ని ఉపయోగించుకుంటాను. కథలను ఆయనకు కూడా వింటారు. అయితే కేవలం ఆయన
తన అభిప్రాయాన్నే చెబుతారు. నిర్ణయం నన్నే తీసుకోమంటారు. మొదటి సినిమా కాబట్టి 'జోష్' కథను నాన్నగారు విన్నారు. రెండో సినిమాను నన్నే ఎంపిక చేసుకోమన్నారు.
యాక్షన్ నెక్స్ట్ ...
నా తదుపరి చిత్రం కామాక్షి కళా మూవీస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్నారు. కొత్త దర్శకుడు ఉంటారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా ఇది. మరో వారంలో పూర్తి వివరాలు చెబుతాను. భవిష్యత్తులో మాత్రం నాన్నగారితో కలిసి నటించాలనే ఆలోచన ఉంది. అందుకు తగిన స్క్రిప్టు కుదిరితే ఇద్దరూ నటించడానికి సిద్ధంగా ఉన్నాం.
ఖాళీ సమయాల్లో...
జిమ్, డాన్స్ లు, ఫైట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. బైకులు, కార్ల డ్రైవింగ్ అంటే ఇష్టం. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తుంటాను.
నో డైరెక్షన్...
టాప్ డైరెక్టర్లతో పనిచేయాలని ఉంది. దర్శకత్వం చేయాలనే ఆలోచన మాత్రం లేదు. హీరోగా విలక్షణ పాత్రలు పోషించాలనుకుంటున్నాను.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2
|