నాన్నతో నటిస్తా: నాగచైతన్య
'ఏ మాయ చేసావె' చిత్రం ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోందనీ, ఇందులోని ప్రతి సన్నివేశం సహజత్వానికి దగ్గరగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటోందనీ చిత్ర కథానాయకుడు నాగచైతన్య పేర్కొన్నారు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగచైతన్య మీడియాతో ముచ్చటించారు.
తాత-నాన్న మెచ్చుకున్నారు
సినిమాకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా చూసి మా తాతగారు, నాన్నగారు చాలా బాగుందని, బాగా నటించావనీ మెచ్చుకున్నారు. ఆడియో పెద్ద హిట్ అయింది. మొదటిసారి కాకపోయినా రెండు మూడు సార్లు వినగానే అవి హృదయానికి హత్తుకుంటాయి. ముఖ్యంగా కుందనపు బొమ్మ పాటంటే నాకు చాలా ఇష్టం. పాత్ర పరంగా కథానాయిక మలయాళం అమ్మాయి కాబట్టి సహజత్వం కోసం మలయాళం పాట పెట్టారు.
సహజత్వానికి దగ్గరగా లిప్ కిస్
ముద్దు సన్నివేశాలను సందర్భానుసారంగానే తీశారు. సహజత్వానికి దగ్గరగా వీటిని దర్శకుడు గౌతమ్ తెరకెక్కించారు. దర్శకుడు చెప్పినట్టే చేశాం. అలాగే క్లైమాక్స్ ను అమెరికాలోని న్యూయార్క్ లో సినిమా ప్రారంభంలోనే తీశారు. రోడ్డుపైన తొలి ముద్దు సన్నివేశంలో పాల్గొన్నాను. అయితే అక్కడ ఎవరూ పట్టించుకోలేదు.
తమిళంలో కూడా చేస్తా
తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించాలని ఉంది. నా స్కూలింగ్ అంతా చెన్నైలోనే జరిగింది. తమిళం బాగా తెలుసు. అవకాశాలు వస్తే చేస్తాను. అయితే స్ట్రయిట్ చిత్రమే చెస్తాను.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2-
|