రామ్ బ్లాగ్ హ్యాకింగ్...
తెలుగు హీరోల్లో సొంత బ్లాగ్స్ ఏర్పాటు చేసుకున్న హీరోలు చాలా అరుదు. ఫ్యాన్స్ తో నేరుగా ఇంటరాక్ట్ కావడానికి బాలీవుడ్ తారలు సహజంగా ఇలాంటి బ్లాగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. తన కొత్త చిత్రాలు, వాటి ప్రోగ్రస్, పెర్సనల్ విషయాలు ఈబ్లాగ్ లో పొందుపరుస్తుంటారు. హీరో రామ్ ఈమధ్యనే 'హీరోరామ్.కామ్' పేరుతో ఓ వెబ్ సైట్ స్టార్ట్ చేసి రెగ్యులర్ గా బ్లాగ్స్ రాస్తున్నారు. నూహ్యంగా రెండ్రోజుల క్రితం ఆయన బ్లాగ్ ను ఎవరో 'హ్యాక్' చేశారు. దీంతో ఆయన కొద్దికాలంగా ఫ్యాన్స్ తో కొనసాగిస్తూ వచ్చిన ఇంటరాక్షన్ సమాచారం ఆయన సైట్ నుంచి మాయమైంది.
హ్యాకింగ్ ఎవరు చేసారనేది తనకు తెలియదనీ, కొంత బ్యాక్ అప్ మినహాయిస్తే మిగతా సమాచారం అంతా మాయమైందనీ రామ్ ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఎవరూ తనను అభిమానులకు దూరం చేయలేరని అంటున్నారు. ఈసారి అలాంటి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. పనిలో పనిగా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసే ఆలోచనలోనూ ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన శ్రీవాస్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవల రాజమండ్రి షూటింగ్ లో తనకెదురైన అనుభవాలను కూడా ఆయన తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.
Be first to comment on this News / Article!
|