'సేవ'లే చేశానంటున్న రంజిత!
స్వామి నిత్యానంద 'సెక్స్ స్కాండిల్' లో చిక్కుకున్న నటి రంజిత గురించి కొద్ది రోజులుగా పలు కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. సెక్స్ వీడియోలోని దృశ్యాలు రంజితను పోలి ఉన్నాయంటూ కథనాలు రావడంతో రంజిత కొద్దిరోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. ఆమె హైద్రాబాద్ లో తన సహచర నటి వద్ద తలదాచుకుందనీ, ఆమెను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇండియన్ ఆర్మీకి చెందిన రాకేష్ మీనన్ టీవీ ఛానెల్స్, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి తీవ్ర మనో వేదనకు గురయ్యారనీ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యానందకు కేవలం తాను 'సేవ' మాత్రమే చేశానంటూ రంజిత పేర్కొన్నట్టుగా 'కుముదం' మ్యాగజైన్ ఓ వార్తను ప్రచురించింది.
'స్వామి నిత్యానంద భక్తురాలిగా ఆయనకు సేవలు మాత్రమే చేశాను. కొందరు స్వార్ధపరులు కుట్రపన్ని అసభ్యకరమైన రీతిలో వీడియోను చిత్రీకరించారు. ఆ వీడియో చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇందులో నిజానిజాలు ఏమిటనేవి త్వరలోనే అందరికీ బహిరంగం చేస్తాను' అని రంజిత పేర్కొంది. ఆమె వెల్లడించే వాస్తవాలు ఏమిటనేవి వేచిచూడాల్సిందే.
Be first to comment on this News / Article!
|