మ్యాజిక్ చేసే కౌబాయ్: లారెన్స్
అన్నీ హైలైట్సే....
సినిమాలో ఫలానాది అని కాకుండా చాలా హైలైట్స్ ఉన్నాయి. ఇందులో వేగంగా హ్యాట్స్, గన్స్ తిప్పుతుంటాను. ఇందుకోసం తగినంత ప్రాక్టీస్ కూడా చేశాను. ఇటీవల వచ్చిన యుగానికి ఒక్కడు తరహాలో చాలా భారీగా సినిమా ఉంటుంది. అలాగే సాయికుమార్ ఓ ప్రత్యేక పాత్రలో అలరిస్తారు. జి.వి.ప్రకాష్ సంగీతం మరో హైలైట్. దర్శకుడు శింబుదేవన్ చాలా ప్రతిభావంతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ముచ్చటైన లొకేషన్లు...
హాలీవుడ్ స్థాయిలో కేరళలో ఓ అద్భుతమైన సెట్ వేశాం. తెన్ కాసి, తడ, మధ్యప్రదేశ్, రాయచోటి, బెంగుళూరు, పుణె, నాగపూర్, పాల్ఘాట్, అంబసముద్రం, పాండిచ్చేరిలలో షూటింగ్ చేశాం. కంచి కెనాల్ లో 20 కిలోమీటర్లుబోటు ద్వారా ప్రయాణించి తీసిన సన్నివేశాలు కూడా అద్భుతంగా వచ్చాయి.
అనుష్కతో 'కాంచన'...
నా తదుపరి చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఉంటుంది. దీని పేరు 'కాంచన'. అనుష్క కథానాయిక. నేను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించనున్నాను. నాకు వేరే హీరోయిన్ ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారంలో సినిమా ప్రారంభమవుతుంది. అలాగే నాగార్జున, ప్రభాస్, అల్లు అర్జున్ ల కోసం స్క్రిప్టు రెడీ చేసుకుంటున్నాను.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|