మ్యాజిక్ చేసే కౌబాయ్: లారెన్స్
వినోదంతో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'సూపర్ కౌబాయ్' అని ఆ చిత్ర కథానాయకుడు రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడైన లారెన్స్ తాజాగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. పద్మప్రియ, లక్ష్మీరాయ్ హీరోయిన్లుగా నటించారు. ఎజిఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శింబుదేవన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. చిత్ర విశేషాలను లారెన్స్ హైద్రాబాద్ లో మంగళవారం నాడు ముచ్చటించారు.
కౌబాయ్ చిత్రాల్లో స్పెషల్...
ఇది కౌబాయ్ చిత్రాల్లోనే ఓ ప్రత్యేకత కలిగిన చిత్రం. మంచి కామెడీ ఉంటుంది. మంచి ఫైట్స్ ఉన్నాయి. చిన్న పిల్లలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 20 కోట్ల బడ్జెట్ తో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తీశారు. అవసరమైన చోట్ల సెట్స్ వేశారు. ఓ హాలీవుడ్ చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది.
సింహం...సింగారం
ఇందులో సింహం పేరుతో కౌబాయ్ గా, సింగారం అనే పేరుతో మరో పాత్ర పోషించాను. రెండో పాత్ర చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అణచివేతకు గురవుతున్న ప్రజలను సింహం ఎలా కాపాడిందనేది సినిమాలో చూడాల్సిందే. స్వతహాగా డాన్స్ మాస్టర్ ను కూడా కావడంతో ఆ స్పీడ్ ఫైట్స్ లోనూ కనిపిస్తుంది.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|