ముమైత్ 'ఎల్ బోర్డ్'
ఐటెం గాళ్ గా సంచలనం సృష్టించి..'మైసమ్మ ఐపిఎస్', 'మంగతాయారు టిఫిన్ సెంటర్', 'టార్గెట్' వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కథానాయికగా నటించిన ముమైత్ ఖాన్ మరోసారి ప్రధాన భూమిక పోషిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఎల్ బోర్డ్'. దీనిని హిందీలోనూ 'లవ్ డాట్ కామ్' పేరుతో తీస్తున్నారు. ఆర్.జె.ఫిలిమ్స్ బ్యానర్ పై యువరాజ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. యువరాజ్ జె.దర్శకుడు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగులో ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందని, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుందనీ చెప్పారు. మాఫియా గ్యాంగ్ లో ఉండే ఓ కుర్రాడు క్లబ్ డాన్సర్ అయిన ముమైత్ ను ప్రేమిస్తాడనీ, గ్యాంగ్ లీడర్ బారి నుండి తన ప్రియుడ్ని ఆమె ఎలా రక్షించుకుందనేది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ముమైత్ గ్లామర్, నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. ఇందులో నాలుగు పాటలకు బప్పీలహరి సంగీతం అందించారనీ, పాటలన్నీ అందమైన లొకేషన్లలో చాలా రిచ్ గా తీశామనీ తెలిపారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
|