'మహాత్మ' చిత్రానికి అవార్డు
శ్రీకాంత్ కథానాయకుడుగా కృష్ణవంశీ దర్శకత్వంలో సి.ఆర్.మనోహర్ నిర్మించిన 'మహాత్మ' చిత్రం ఉగాది పురస్కారాన్ని అందుకోనుంది. చెన్నై తెలుగు అసోసియేన్ 'శ్రీ కళాసుధ' 2010 సంవత్సరానికి అందించే ఉగాది పురస్కారాలలో ఉత్తమ చిత్రంగా 'మహాత్మ', ఇదే చిత్రానికి ఉత్తమ నటుడుగా శ్రీకాంత్ ను ఎంపిక చేసింది. ఈనెల 12న ఉగాది పురస్కారాల ప్రదానం ఉంటుంది. సామాజిక స్పృహతో తీసిన ఇలాంటి చిత్రాలు సమాజానికి ఎంతో అవసరమనీ, అందుకే ఈ చిత్రాన్ని ఉత్తమ చిత్రం కేటగిరిలో ఎంపిక చేశామనీ శ్రీకళాసుధ సంస్థ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
నిర్మాతగా గోల్డెన్ లయన్స్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రమే ఉత్తమ చిత్రంగా పురస్కారాన్ని అందుకోనుండటం చాలా ఆనందంగా ఉందని, ఈ పురస్కారం మరెన్నో మంచి చిత్రాలు నిర్మించేందుకు ఉత్సాహాన్నిస్తోందనీ సి.ఆర్.మనోహర్ తెలిపారు. ఇదే చిత్రానికి ఉత్తమనటుడుగా శ్రీకాంత్ ఎంపికకావడం, తన మిత్రుడైన శ్రీకాంత్ తో కలిసి ఒకే వేదిక నుంచి ఈ పురస్కారం అందుకోనుండటం ఎప్పటికీ మరిచిపోలేననీ పేర్కొన్నారు. ఇంత చక్కటి చిత్రాన్ని తమ బ్యానర్ లో చేసిన కృష్ణవంశీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నటుడుగా తన 100వ చిత్రం 'మహాత్మ' అనీ, ఎన్నో వ్యయప్రయాశలకోర్చి రూపొందించిన ఈ చిత్రం ద్వారా ఉత్తమ నటుడుగా ఉగాది పురస్కారాన్ని అందుకోవడం అనిర్వచనీయమైన ఆనందాన్నికలిగిస్తోందనీ శ్రీకాంత్ అన్నారు.
Be first to comment on this News / Article!
|