కోర్టులో సెల్వ-సోనియా
కలిసి బతకలేమని అనుకున్నప్పుడు విడిపోయి ఎవరి దారి వారు వెతుక్కోవడమో మంచిదనుకుంటున్నారు స్టార్ కపుల్ సెల్వరాఘవన్, సోనియా అగర్వాల్. పరస్పర అవగాహనతో విడిపోవాలనుకుంటున్నఈ జంట చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. తమ నిర్ణయంలో మార్పు లేదంటూ కోర్టుకు తెలియజేశారు. ఈ కేసు విచాచరణ జరుపుతున్న జస్టిస్ రామలింగం తీర్పును ఈనెల 12వ తేదీకి వాయిదా వేశారు.
దర్శకుడు సెల్వరాఘవన్, నటి సోనియా అగర్వాల్ అప్పట్లో తమిళ 'కాదల్ కొండేన్' చిత్రం షూటింగ్ సందర్భంగా ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన '7/జి బృందావన్ కాలనీ' చక్కటి విజయాన్ని సాధించింది. 2006 డిసెంబర్ లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. రెండేళ్ల వరకూ హ్యాపీగా ఉన్న ఈ జంట పరస్పర అంగీకారంతో 2009 ఆగస్టులో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విడాకుల కేసు దాఖలైన తర్వాత సోనియా మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని నటన వైపు మళ్లారు. కలైంజర్ టీవీలో 'నానల్' టీవీ డ్రామాలో నటించారు. తొలిసారి మలయాళంలో ఓ చిత్రానికి కమిట్ అయ్యారు. సెల్వరాఘవన్ 'యుగానికి ఒక్కడు' చిత్రంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన మరింత పట్టుదలగా తమిళ హీరో విక్రమ్ తో ఓ కొత్త చిత్రాన్ని అంగీకరించారు.
Be first to comment on this News / Article!
|