సిద్దార్ధ కొత్త వెంచర్
హీరో సిద్దార్ధకు నటనతో పాటు దర్శకత్వంపై మంచి మోజు ఉందని ఆయనను దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. సహజంగా ఆయన తన సినిమాల్లో దర్శకుడి పనిలో కూడా వేలు పెడుతుంటాడని అంటారు. అయితే ఇది జోక్యం కాదనీ, సినిమా బాగా రావాలన్న తపనే కారణమని సదరు దర్శకులు ఆ తర్వాత వివరణ ఇవ్వడం కూడా పరిపాటి. దర్శకుడు కావడం మాటెలా ఉన్నా..ప్రసుతానికి మాత్రం నిర్మాతగా మారి సొంతగా సినిమాలు తీయాలనుంటున్నట్టు ఓ నేషనల్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దార్ధ వెల్లడించారు.
కథలకు విలువనిచ్చే సినిమాలు తీయాలనుకుంటున్నాననీ, ఇందుకోసం 2011లో సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నాననీ సిద్దార్ధ తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులు కూడా సమకూర్చుకుంటున్నట్టు చెప్పారు. ఇక నటుడిగా తెలుగులో 'బొమ్మరిల్లు' తర్వాత సరైన బ్రేక్ రాకపోవడం, ఇటీవలే బాలీవుడ్ లో సోలో హీరోగా నటించిన 'స్ట్రైకర్' అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లో అట్టర్ ప్లాప్ క్లావడంతో తన భవిష్యత్ చిత్రాలపై ఆయన గట్టి ఆశలే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సోషియో ఫాంటసీ చిత్రంలోనూ, గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న 'బావ' చిత్రంలోనూ నటిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|