ఆమె వధువేంటి?!
భారీ సెట్టింగ్ లతో సెల్యులాయెడ్ వండర్స్ సృష్టించే దర్శకుడు గుణశేఖర్ తన తాజా చిత్రం 'వరుడు' విషయంలో హీరోయిన్ ఎవరనేది చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు. సినిమా రిలీజ్ రోజునే హీరోయిన్ పేరు రివీల్ చేస్తామంటూ ఇంతవరకూ చెప్పుకొచ్చిన గుణశేఖర్ ఇప్పుడు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్న భాను మెహ్రా ఫోటోలు చూసి...ఇవన్నీ ఊహాగానాలే...నిజం మాత్రం లేదంటూ నమ్మబలుకుతున్నారు.
'ఇంటర్నెట్ లో కొన్ని ఫోటోలు రావడం నా దృష్టికి వచ్చింది. ఆ ఫోటోలు మా హీరోయిన్ వి కావు. వరుడు హీరోయిన్ గురించి వస్తున్న వార్తులు, ఫోటోలు ఎవరికి వారు ఊహిస్తున్న ఊహాగానాలే తప్ప వాస్తవాలు కావు. కథ ప్రకారమే ఇందులో హీరోయిన్ ఎవరనేది సినిమా రిలీజ్ వరకూ సస్పెన్స్ లో ఉంచాలనుకున్నాం. ఇది పబ్లిసిటీ గిమ్మిక్కు మాత్రం కాదు. ఈ కథకు హీరోయిన్ ని అలా రివీల్ చేయకపోవడమే కరెక్ట్ అని ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు అనుకుంటారు. అలాంటి ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో పాటు కథకు కంపల్సరీ అవసరమయ్యే వరుడు హీరోయిన్ స్టిల్స్ కానీ, పేరును కానీ ఇంతవరకూ పబ్లిసిటీలో ఉపయోగించలేదు' అని గుణశేఖర్ వివరణ ఇచ్చారు. పనిలో పనిగా...మీడియా మిత్రులు కూడా ఈ విషయంలో (హీరోయిన్ గురించి మరిన్ని ఊహాగానాలు చేయకుండా...తెలిసినా బయటకు చెప్పకుండా) సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. నిజానికి గుప్పిట మూసినంత వరకూ జనాల్లో ఉత్సుకత సహజమేనని గుణశేఖర్ కు తెలియదనిది కాదు కదూ?!
Be first to comment on this News / Article!
|