గట్స్ ఉన్న'దాసన్నా': శ్రీహరి
?ఆడియోకి ఎలాంటి స్పందన వచ్చింది
- శ్రీలేఖ సంగీత సారధ్యం వహించిన ఆరు పాటలు ఆరు ఆణిముత్యాలు. ఇటీవలే ఆడియో విడుదలైంది. ప్రముఖ గాయనీగాయకులు ఆలపించారు. ఆడియోకి చాలా మంచి స్పందన వచ్చింది. ఇక చిత్రీకరణ పరంగా కూడా పాటలు హైలైట్ గా నిలుస్తాయి.
?శ్రీహరి అనగానే ఫైట్స ఊహించుకుంటారు. అవి ఏ రేంజ్ లో ఉంటాయి
- ఫైటింగ్ షాట్స్ చాలా కొత్త తరహాలో ఉంటాయి. 'భద్రాచలం' చిత్రానికి ఎంత కష్టపడ్డామో, అంతకంతా ఈ చిత్రం కోసం కష్టపడ్డాం.
?మీ కెరీర్ కు ఈ చిత్రం ఎలా హెల్ప్ అవుతుందనుకుంటున్నారు
- మా వంతు కష్టం మేం చేశాం. ఫలితం ప్రేక్షకు దేవుళ్ల మీదే ఉంటుంది. నా కెరీర్ లో ఇదో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నమ్ముతున్నాను.
?ఇతర సినిమాల గురించి...
- ఎన్టీఆర్ 'బృందావనం'లో కీలక పాత్ర పోషిస్తున్నాను. అలాగే రవితేజ 'డాన్ శ్రీను'లో నటిస్తున్నాను. ఇందులో నా పాత్ర ఢీ, కింగ్ సినిమాల్లోని రెండు పాత్రలు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అల్లరి నరేష్ తో ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. ఇక సోలో హీరోగా '100 దేవుడొస్తాడు' చిత్రం చేస్తున్నాను. ఏడాదిలో కనీసం రెండు ప్రాజెక్టులు సోలో హీరోగా చేస్తాను. మొదటి ప్రాధాన్యతా క్రమం కూడా దానికే. అయితే ఇతర సినిమాల్లోనూ మంచి పాత్రలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమే.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|