ఛార్మి 'ఇందు' 19న
గ్లామర్ నటి ఛార్మి కథానాయికగా పి.వాసు ('చంద్రముఖి' ఫేమ్) దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఓ చిత్రాన్ని 'ఇందు' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. తైలం శ్రీనాగవర్మ సమర్పణలో మురారి శెట్టి లక్ష్మణ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేస్తున్నారు.
ఒక వైవిధ్యమైన సబ్జెక్ట్ ను తీసుకుని దర్శకుడు పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, మలేషియన్ కాలేజీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని నిర్మాత లక్ష్మణ్ తెలిపారు. ఆడపిల్లలను ప్రేమానురాగాలతో కాలేజీలకు పంపాలే కానీ అనుమానంతో కాదనే సందేశం ఇందులో ఉంటుందన్నారు. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు, జాతీయ అవార్డు గ్రహీత విద్యాసాగర్ అందించిన సంగీతం ప్రధాన హైలైట్స్ గా నిలుస్తాయని అన్నారు. శరవణ ఆడియోస్ ద్వారా విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వస్తోందనీ, ఈ వారాంతంలోనే ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక జరిపి 19న సినిమా రీలీజ్ చేస్తామని చెప్పారు. సినిమా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం తమకుందని తెలిపారు. బాల కథానయకుడుగా నటించిన ఈ చిత్రంలో వాసు, కళాభవన్ మణి, వివేక్, మణిరత్నం, మీరా కృష్ణన్, మనో తదితరులు నటించారు. బోస్ సంభాషణలు, ఎం.కేశవన్ సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|