'వరుడు' రిలీజ్ వాయిదా?
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడుగా నటించిన 'వరుడు' చిత్రం ఓ వారం రోజులు వాయిదా పడినట్టు సమాచారం. ముందుగా నిర్మాతలు ప్రకటించిన ప్రకారం ఈనెల 26న సినిమా రిలీజ్ కావలసి ఉంది. అయితే ఇప్పుడు ఆ తేదీని ఏప్రిల్ 2కు వాయిదా వేసినట్టు తెలిసింది. అల్లు అర్జున్ ఈ చిత్రంలోని ఓ పాట చిత్రీకరణ సందర్భంగా చేతికి గాయమైంది. దీంతో పాట చిత్రీకరణకు కొద్ది పాటి వ్యవధి తీసుకోవడం, రీ-రికార్డింగ్ కు తగిన సమయం అవసరమని భావించడం వల్ల ఈ జాప్యం అనివారమైనట్టు చెబుతున్నారు.
అల్లు అర్జున్ నటన ఈ చిత్రంలో ప్రధాన హైలైట్ గా నిలువనుంది దానయ్య చెబుతున్నారు. తమ సంస్థ అల్లు అర్జున్ తో నిర్మించిన 'దేశముదురు' కంటే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఆడియో ఈనెల 7న ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలై మంచి ఆదరణ చూరగొంటుండటం కూడా సినిమాపై మంచి అంచనాలను రేకెత్తిస్తోంది. అల్లు అర్జున్ సరసన ఓ కొత్తమ్మాయి నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్ గా నటించడం ఓ విశేషం. దిగ్దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరో కీలక పాత్ర పోషించారు. నిజజీవితంలోని 100 కుటుంబాలకు చెందిన వారు ఇందులో నటించారు. అల్లు అర్జున్ తో స్నేహ ఉల్లాల్ స్పెషల్ సాంగ్ ఇంకో ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ తదితరులు నటించారు. మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ఇందులో సర్ ప్రైజ్ ప్యాకేజ్ గా కనిపించబోతున్నారు. గుణశేఖర్ కథ-స్క్రీన్ ప్లే సైతం అందించిన ఈ చిత్రానికి వేటూరి పాటలు, ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ పైట్స్, ఆంధోని ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|