'తాజ్ మహల్'కు ముహూర్తం
హీరో శివాజీ కథానాయకుడుగా నటిస్తూ తొలిసారి నిర్మాతగా మారి శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'తాజ్ మహల్'. అరుణ్ సింగరాజు దర్శకుడు. జనవరిలో ఈ చిత్రం విడుదల చేయాలనుకున్నప్పటికీ కొద్ది పాటి జాప్యంతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈనెల 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు శివాజీ ప్రకటించారు.
కన్నడంలో సంచలన విజయం సాధించి ప్రతి ఒక్కరి ఆదరాభిమానం చూరగొన్న ఈ చిత్రం తెలుగువారిని కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో నిర్మాతగా మారినట్టు ఆయన తెలిపారు. 'ఇందుమతి' చిత్రంలో నటిస్తున్నప్పుడు పరిచయమైన అరుణ్ ఈ చిత్రాన్ని అద్భుతమైన దృశ్యకావ్యంగా మలిచారని తెలిపారు. చక్కటి కళాత్మక విలువలతో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే గట్టి నమ్మకం ఉందని అన్నారు. కన్నడంలో పెద్ద సక్సెస్ సాధించడంతో పాటు తన మనసుకు సూటిగా తగిన కథ ఇదనీ, శివాజీ కెరీర్ లో ఇదో పెద్ద హిట్ అవుతుందని అరుణ్ తెలిపారు. శివాజీ సరసన శ్రుతి హీరోయిన్ గా పరిచయమవుతోంది. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాజర్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రఘబాబు ఇతర పాత్రలు పోషించారు. సోమా విజయప్రకాష్ నిర్మాణ సారథ్యం వహించిన ఈ చిత్రానికి గంగోత్రి విశ్వనాథ్ మాటలు, వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, అభిమాన్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|