విద్యార్థికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాయం
హీరోల అభిమానులు పలు సందర్భాల్లో తమ సేవా నిరతి ద్వారా వారిపై తమకున్న అభిమానం చాటుకుంటూ ఉంటారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గణికల్ గ్రామానికి చెందిన బి.నగేష్ అనే పేద విద్యార్థికి విద్యాభాస్యం నిమిత్తం 5,000 రూపాయలను ఎన్టీఆర్ సేవా సమితి అందజేసింది. ఎన్టీఆర్ చేతుల మీదుగా సేవా సమితి అధ్యక్షుడు కె.ఎం.ముజీబ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.చాంద్ బాషా, జి.బాలుయాదవ్, కె.అశోక్, కె.విశ్వనాథ్, ఎ.ఎస్.చాంద్, కె.అభిరాము, వై.రవికుమార్, కె.వెంకటేష్, డి.వెంకటేష్, బి.వీరేంద్ర, వి.వీరేష్, వి.మల్లేష్, బి.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Read 2 Comment(s) posted so far on this News / Article!
|