డిటిఎస్ లో 'మరోచరిత్ర'
వరుణ్ సందేష్, అనిత (తొలి పరిచయం) జంటగా నటించిన 'మరోచరిత్ర' చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ప్రస్తుతం డిటిఎస్ మిక్సింగ్ పనులు జరుగుతున్నట్టు చిత్ర నిర్మాత దిల్ రాజు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవియాదవ్ దర్శకుడు.
చిత్ర విశేషాలను దిల్ రాజు తెలియజేస్తూ, ఈ వేసవికి బెస్ట్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోతుందని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. ప్రమోషన్ వర్క్ లో భాగంగా మొదట ఫాపింగ్ మాల్స్ లో ఏర్పాటు చేసిన ఆడియో పోల్స్ కు మంచి స్పందన వచ్చిందనీ, అలాగే ఎవోల్ ట్రీ వెబ్ సైట్ ను ప్రారంభించి పాటలను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించామనీ చెప్పారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించిన పాటలకు చాలా మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ముఖ్యంగా ఇందులోని మూడు మెలోడీ పాటలకు మంచి స్పందన వస్తోందన్నారు. నెలాఖరుకు సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. శ్రద్ధాదాస్, ఆదర్స్, యామి గౌతమ్, ప్రతాప్ పోతన్, కోట శ్రీనివాసరావు, నరేష్, తలైవాసల్ విజయ్, సంధ్య జనక్, ఊర్వశి తదితరులు నటించిన ఈ చిత్రానికి రవియాదవ్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ సైతం అందిస్తున్నారు. వనమాలి-కృష్ణచైతన్య సాహిత్యం అందించారు.
Be first to comment on this News / Article!
|