ప్రభాస్ 'డార్లింగ్' ఏప్రిల్ లో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడుగా కరుణాకరణ్ ('తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై భోగవల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రచారార్భాటాలకు దూరంగా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ఇందులో ప్రభాస్ కు జోడిగా కాజల్ నటించింది.
'ఛత్రపతి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ తో తమ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రం మరింత పెద్ద సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉందనీ, స్విట్జర్లాండ్, బ్యాంకాక్, అరుకు, హైద్రాబాద్ లలో షూటింగ్ జరిపామనీ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. ప్రభాస్ కెరీర్ లోనే ఓ డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా దీనిని కరుణాకరణ్ తెరకెక్కించారని తెలిపారు. ఈ చిత్రంలో తమిళ హీరో ప్రభు ఓ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి ఆండ్రూస్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ పైట్స్, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|