సిద్దార్ధ చిత్రానికి డిస్నీ సపోర్ట్
సిద్దార్ధ, శ్రుతిహాసన్ జంటగా కె.రాఘవేంద్రరావు తనయుడు కె.ప్రకాశరావు దర్శకత్వం వహిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రానికి ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ సహ భాగస్వామ్యం వహించబోతోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి అవసరమైన సాంకేతిక సపోర్ట్ ను ఇవ్వబోతోంది. కథకు అనుగుణంగా సి.జి.వర్క్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో డిస్నీ తమ సపోర్ట్ ను అందించేందుకు ముందుకు వచ్చింది.
ప్రత్యేక శక్తులు కలిగిన ఓ తొమ్మిదేళ్ల అమ్మాయి చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ పాత్రను బేబి హర్షిత పోషిస్తోంది. ఆ పాపను రక్షించే స్వార్డ్ మన్ గా సిద్దార్ధ, అతనికి జోడిగా శ్రుతి, ఈవిల్ క్వీన్ గా మంచు లక్ష్మీప్రసన్న నటిస్తున్నారు. అబోడ్ బ్యానర్ లో కె.రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం 2011 సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది.
Be first to comment on this News / Article!
|