'డాన్ శీను' బిజినెస్ స్పీడ్
క్రేజీ స్టార్ రవితేజ కథానాయకుడుగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వెంకట్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'డాన్ శీను'. కె.అచ్చిరెడ్డి సమర్పణలో వి.సురేష్ రెడ్డి సహనిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. గోపిచంద్ మలినేని దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. ఈ దశలోనే పలు ఏరియాలకు ఫ్యాన్సీ ఆఫర్లతో బిజినెస్ పూర్తి కావడం విశేషం. నైజాం ఏరియాలో ఏషియన్ ఫిలింస్, ఓవర్సీస్ రైట్స్ గ్రేట్ ఇండియా ఫిలింస్ ఇప్పటికే ఫ్యాన్సీ ఆఫర్ తో దక్కించుకున్నాయి. తాజాగా ఈ చిత్రం సీడెడ్ ఏరియా రైట్స్ జి.బి.ఆర్.ఫిలింస్ మహేష్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు హరి పిక్చర్స్ హరికుమార్ మంచి ఆఫర్ ఇచ్చి సొంతం చేసుకున్నారు. తొలి షెడ్యూల్ జరుగుతుండగానే ఇంత స్పీడ్ గా బిజినెస్ అవుతున్న 'డాన్ శీను' ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది.
రవితేజకు జోడిగా 'భగీరధ' తర్వాత శ్రియ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండం విశేషం. దీనికి తోడు రవితేజతో 'కిక్' వంటి సూపర్ హిట్ ను అందించిన నిర్మాత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం కూడా భారీ అంచనాలకు తావిస్తోంది. ఇందలో శ్రీహరి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సాయాజీ షిండే, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, రఘుబాబు, కృష్ణ భగవాన్, నాజర్, దువ్వాసి, బ్రహ్మాజీ, ఢిల్లీ రాజేశ్వరి, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే సైతం గోపీచంద్ మలినేని అందిస్తున్న ఈ చిత్రానికి సీతారామశాస్త్రి-రామజోగయ్య శాస్త్రి పాటలు, కోన వెంకట్ మాటలు, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|