ప్రభాస్ 'డార్లింగ్' ఏప్రిల్ 16న
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కరుణాకరన్ దర్శకత్వంలో 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ వివారాలను చిత్ర యూనిట్ తెలియజేసింది.
ప్రభాస్ మాట్లాడుతూ, కరుణాకరన్ తనకెంతో ఇష్టమైన దర్శకుడనీ, ఆయన తీసిన 'తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రాలు చూసి తానెంతో ఇంప్రెస్ అయ్యాననీ చెప్పారు. ఈ చిత్ర కథ కూడా తననెంతో ప్రభావితం చేసిందనీ, ప్రేమ, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ కలగలసిన ఫ్యామిలీ ఫీల్ ఉన్న సినిమా ఇదనీ చెప్పారు. కరుణాకరన్ స్టైల్ లో మంచి ఫీల్ ఉన్న సినిమా ఇదని ఛత్రపతి ప్రసాద్ తెలిపారు. లవ్ ఫీల్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ వంటివన్నీ ఇందులో ఉన్నాయనీ, ఇటు యూత్, అటు ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకునే విధంగా కరుణాకరన్ ఎక్స్ టార్డినరీగా తీశారనీ చెప్పారు. టేకింగ్ సైడ్ గానీ, మేకింగ్ సైడ్ గానీ రిచ్ గా ఉంటుందనీ, ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిందనీ చెప్పారు. మార్చి నెలాఖరులో ఆడియో, ఏప్రిల్ 16న సినిమా రిలీజ్ కు ప్లాన్ చేశామనీ చెప్పారు. కరుణాకరన్ మాట్లాడుతూ, క్లాస్ గా కనిపించే మాస్ లవ్ స్టోరీ ఇదనీ, మాస్ కు ఈ చిత్రం బాగా నచ్చుతుందనీ చెప్పారు. ప్రభాస్ అద్భుతమైన నటన ప్రదర్శించారనీ, నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారనీ చెప్పారు. జి.వి.ప్రకాష్ మంచి హోమ్ వర్క్ చేసి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారనీ, రీ-రికార్డింగ్ చాలా బాగా వస్తోందనీ చెప్పారు. అలాగే ఈ సినిమా ద్వారా కెమెరామన్ గా పరిచయం చేసిన ఆండ్రూకు మంచిపేరు వస్తుందన్నారు. ప్రభాస్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో ప్రభు, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, ప్రభాస్ శ్రీను, రాజాశ్రీధర్ తదితరులు నటించారు. స్వామి మాటలు, అనంత్ శ్రీరామ్ పాటలు,
ఆండ్రూ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ పైట్స్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|