స్టార్ జంటకు విడాకులు
ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్, నటి సోనియా అగర్వాల్ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో చట్టబద్ధంగా వీరు విడిపోయినట్టయింది. ఈనెల 9న పరస్పర అవాగాహనతో విడిపోతున్నట్టు పేర్కొంటూ చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో డైవోర్స్ సూట్ ను వీరిరువురు దాఖలు చేశారు. దీంతో 12వ తేదీకి తీర్పును కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ రామలింగం శుక్రవారంనాడు ఈ ఇద్దరికీ విడాకులు మంజూరు చేశారు.
తమిళ చిత్రం 'కాదల్ కొండేన్' షూటింగ్ సమయంలో సెల్వరాఘవన్, సోనియా అగర్వాల్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత సోనియా హీరోయిన్ గా నటించిన సూపర్ హిట్ చిత్రం '7/జి బృందావన్ కాలనీ'కి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. అనంతరం 2006 డిసెంబర్ లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. రెండేళ్ల కాపురం అనంతరం 2009 ఆగస్టులో విడాకులు కోరుతూ వీరు కోర్టును ఆశ్రయించారు.
Be first to comment on this News / Article!
|