అనుష్క 'పంచాక్షరి' పూర్తి
'అరుంధతి' చిత్రం సంచలన విజయం తర్వాత మరోసారి అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'పంచాక్షరి'. నాగార్జున పర్సనల్ మేకప్ బొమ్మదేవర రామచంద్రరావు అలియాస్ చంద్ర ఈ చిత్రాన్ని సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై తొలిసారి నిర్మిస్తున్నారు. వి.సముద్ర దర్శకుడు. రాజమండ్రిలో జరిగిన షెడ్యూల్ తో షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ మొదటివారంలో ఆడియో, చివరి వారంలో సినిమా విడుదలకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
అనుష్క మాట్లాడుతూ, ఇదొక అద్భుతమైన స్క్రిప్టు అనీ, అరుంధతి సినిమాతో ఎలాంటి పోలికలు ఉండవనీ చెప్పారు. ఇందులో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందనీ, కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందన్నారు. సముద్ర చాలా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనీ, అలాగే నిర్మాతకు ఇది గ్రేండ్ ఎంట్రీ అవుతుందని చెప్పారు. చంద్ర మాట్లాడుతూ, అన్నపూర్ణ స్టూడియోస్ కు తాను జీవితాతం రుణపడి ఉంటాననీ, అలాగే ఈ చిత్రానికి అనుష్క అందించిన సహకారం మరువలేననీ అన్నారు. ఈ ఏడాది సూపర్ హిట్ చిత్రాల్లో పంచాక్షరి ఒకటవుతుందని అన్నారు. నిర్మాత చంద్ర ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారనీ, అనుష్క కెరీర్ లో ఇది మరో సంచలన చిత్రం అవుతుందనీ సముద్ర తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సామ్రాట్ (తొలి పరిచయం), నాజర్, చంద్రమోహన్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, ఆలీ తదితరులు నటించారు. మధు విప్పర్తి కథ, తోట ప్రసాద్ మాటలు, చంద్రబోస్-రామజోగయ్య శాస్త్రి-సుద్దాల అశోక్ తేజ పాటలు, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, సెల్వ పైట్స్, చిన్నా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|