'కిల్లర్' ఎవరు?
మాజీ మిస్ ఇండియా వరల్డ్ గద్దె సింధూర హీరోయిన్ గా శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో కిరణ్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'కిల్లర్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.
నగేష్ నారదాసి మాట్లాడుతూ, ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన వెరైటీ థ్రిల్లర్ ఈ చిత్రమనీ, ఇందులో కిల్లర్ ఎవరనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందనీ చెప్పారు. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉంటాయనీ, సాయికార్తీక్ ఆధ్వర్యంలో ఈ పాటలు అద్భుతంగా వచ్చాయనీ చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. మార్చి నెలాఖరుకు ఆడియో, ఏప్రిల్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జీవా, రామిరెడ్డి, రవిప్రకాష్, పొన్నాంబళం, సుమన్ శెట్టి, నిళల్ గళ్ రవి, తనికెళ్ల భరణి, దిల్ రమేజ్, విజయ్ తదితరులు నటించారు. మధు ఎ నాయుడు సినిమాటోగ్రఫీ, నందు ఫైట్స్, సాయికార్తీక్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|